ఆయుష్మాన్ భారత్, ఈ శ్రమ్ కార్డులు పేదలకు భరోసా

నమస్తే శేరిలింగంపల్లి: పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్, ఈ శ్రమ్ కార్డులను అందజేయడం‌ జరుగుతుందని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అన్నారు. మాదాపూర్ డివిజన్ సాయి నగర్ లో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య, ఈ -శ్రమ్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే సెంటర్ ను బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యం, ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే సౌకర్యం కల్పించడం జరుగుతుందని అన్నారు. రూ. 5 లక్షల వరకు ఆయుష్మాన్ భారత్ ద్వారా చికిత్స చేయించుకోవచ్చని చెప్పారు. ఆయుష్మాన్ కార్డు కోసం ఆధార్ కార్డ్ నంబర్, ఆధార్ కార్డు కు మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల కోసం ఈ శ్రమ్ కార్డు ను రూపొందించారని చెప్పారు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 2 లక్షలు, ప్రమాదంలో అంగవైకల్యం‌ కలిగిన వారికి లక్ష రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ కంటెస్టెడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, ప్రభాకర్ యాదవ్, హరి కృష్ణ , మధు యాదవ్, రాజేశ్వర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, మహిళ మోర్చ నాయకులు పద్మ ,రేణుక రమాదేవి, బిజెవైఎం నాయకులు హరిప్రియ, ఆనంద్, శ్రీధర్, విజయ్, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ శ్రమ్ కార్డులను అందజేస్తున్న రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here