నమస్తే శేరిలింగంపల్లి: సగర సంఘం రాష్ట్ర యూత్ కార్య నిర్వహక కార్యదర్శిగా శేరిలింగంపల్లి కి చెందిన ఆస్కాని రవీందర్ సగర నియామకం అయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ సగర, ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, రాష్ట్ర యూత్ అధ్యక్షులు సతీష్ సగర హైదరాబాద్ లోని అంజయ్య నగర్ సగర సంఘం భవనంలో ఆస్కాని రవీందర్ ను నియమిస్తూ నియామకం పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా పై నమ్మకంతో బాధ్యతలను అప్పగించిన రాష్ట్ర సగర సంఘానికి మరిన్ని సేవలు అందిస్తానన్నారు. సగర పెద్దలకు, గ్రేటర్ అధ్యక్షులు మోడల రవి సగర్, కాలనీ సగర సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ సగర, కొండాపూర్ సగర సంఘం అధ్యక్షుడు అశోక్ సగర, రాము సగర, సాయి గణేష్ సగర, మహేందర్ సగర ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.