నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నామని స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని డీకే ఎన్ క్లేవ్ కాలనీలో పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై అసోసియేషన్ సభ్యులు, స్థానికులతో కలిసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాదయాత్ర చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ ప్రతి కాలనీ, బస్తీలో ప్రజలకు మెరుగైన మౌళికవసతులు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు.

కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గంగాధర్ రావు, అసోసియేషన్ సభ్యులు జి. విజయ్, వి. బి రావు, ఎన్. రాంబాబు, జి. విశ్వనాథ్, అనిరోయ్ గౌర్, జి. వి సుబ్బారావు, సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మయూరీ నగర్ కాలనీలో మార్నింగ్ వాక్ లో భాగంగా వాకర్స్ తో కలసి పార్కుల్లోని పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నారాయణరావు, రంగారావు, వెంకట్ రామి రెడ్డి, కృష్ణ కుమార్, నరసింహం, నళిని మోహన్ రావు, సూర్యనారాయణ రాజు, సత్యనారాయణ, ప్రేమ్, రమేష్ బాబు, పిడి శ్రీనివాస్, నాదెళ్ల శ్రీనివాస్ రావు, వెంకట్, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.
