నమస్తే శేరిలింగంపల్లి: మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు బిజెవైఎం నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పుట్టిన రోజును పురస్కరించుకుని బిజెవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి జితేందర్, బిజెవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆకుల సందీప్,బిజెవైఎం డివిజన్ అధ్యక్షులు ఆనంద్ కుమార్, నవీన్ రెడ్డి, బిజెవైఎం డివిజన్ ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ తదితరులు కలిసి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
