నమస్తే శేరిలింగంపల్లి: శారీరక దారుఢ్యం పెరుగుదల కోసం జీహెచ్ఎంసీ ఓపెన్ జిమ్ లను ప్రవేశపెట్టిందని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. డివిజన్ పరిధిలోని ఆరంబ్ టౌన్ షిప్ లో కాలనీ వాసుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ప్రతినిత్యం కాలనీ వాసులు ఓపెన్ జిమ్ నువినియోగించుకుని శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, ఆర్ జీ కే వార్డు మెంబర్ శ్రీకళ, ఆరంభ టౌన్ షిప్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రవీంద్ర రాథోడ్, అసోసియేషన్ సభ్యులు మైపాల్ యాదవ్, నరేంద్ర కుమార్, రామిరెడ్డి, నరసింహులు యాదవ్, జనార్ధన్, నయీమ్ ఉద్దీన్, సురేష్ నాయక్, విక్రమ్ యాదవ్, అరుణ కుమారి, విజయలక్ష్మి, సరిత, సుజాత యాదవ్, మమతా, చూడామణి, బసవయ్య, లక్ష్మణ్ యాదవ్, బసవరాజ్, గోపాల్ యాదవ్, రవి యాదవ్, గోపాల్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.