నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ నల్లగండ్ల లోని లక్మి విహార్ ఫేజ్ 2 కాలనీ అధ్యక్షునిగా రవీంద్ర ప్రసాద్ దూబే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎల్ వీ 2 కాలనీలో జరిగిన ఎన్నికల్లో ఏడవ సారి అధ్యక్షునిగా ఎన్నికవడం సంతోషంగా ఉందని రవీంద్ర ప్రసాద్ దూబే అన్నారు. గతంలో జీహెచ్ఎంసీ ద్వారా రెండు పర్యాయాలు పర్యావరణ మిత్ర కాలనీగా గుర్తింపు పొందేలా అందరి సహకారంతో కృషి చేశామన్నారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తామని అన్నారు. కాలనీలో పండుగలు పర్వదినాల్లో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలను నిర్వహిస్తామని రవీంద్ర ప్రసాద్ అన్నారు. అధ్యక్షునిగా రవీంద్ర ప్రసాద్ దూబె ఎన్నికవగా ఉపాధ్యక్షులుగా నరసింహా రావు, సత్యనారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్, కోశాధికారిగా సుధాకర్, కార్యదర్శులుగా విద్యాసాగర్, చిత్రభాను, ఏ కె రాయ్, రత్నాకర్ రెడ్డి, రాజు అల్లూరి నివ ఎన్నుకున్నారు.