నమస్తే శేరిలింగంపల్లి: నాసా స్పేస్ ప్రోగ్రామ్ కి భారతదేశం నుంచి తెలుగు బిడ్డ జాహ్నవి దంగేటి ఎంపికవడం సంతోషకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జాహ్నవి మన దేశం నుంచి నాసా స్పేస్ ప్రోగ్రాంకు ఎంపికైన విషయాన్ని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ ద్వారా సమాచారం అందుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జాహ్నవి కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జాహ్నవికి తమ నుంచి ఎలాంటి సహాయ సహకారాలలైనా అందజేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు యోగనంద్, నరేష్, నాయకులు హరికృష్ణ, శ్రీధర్ రావు, రవి గౌడ్, పలు సంఘాల నాయకులు శ్రీనివాస్, సత్యనారాయణ, కొండల్ రావు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
