నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరంలా మారిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న బాధితులకు మంజూరైన రూ. 10.64 లక్షలకు సంబంధించిన చెక్కులను, ఎల్ ఓ సీ పత్రాలను కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తంలా ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, నాయకులు మాచర్ల భద్రయ్య, బ్రిక్ శ్రీనివాస్,పితాని శ్రీనివాస్, చంద్రమోహన్ సాగర్, అనిల్ కావూరి, శేఖర్, రాము తదితరులు పాల్గొన్నారు.