నమస్తే శేరిలింగంపల్లి: జాతీయ నెహ్రూ యువ కేంద్రం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా శాఖ సమన్వయకర్త కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పీజేఆర్ నగర్, ఎల్లమ్మబండ లో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ పొందిన మహిళలకు స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, వివేకానంద సేవా సమితి గౌరవ అధ్యక్షుడు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో యువత కోసం, మహిళల కోసం పలు శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇలాంటి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసిన కుమార్ యాదవ్ ను అభినందించారు. మహిళలు అన్ని రంగాల్లో రావాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం పెద్ద పీట వేస్తూ మహిళ సాధికారత కోసం పని చేస్తున్నాయని అన్నారు. ఇలాంటి అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకొని స్వయం సమృద్ధి సాధించాలని సూచించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఎస్ఎస్ఓ లింగా రెడ్డి, మహిళ సమైక్య నాయకురాలు గణిత, సరస్వతి, అనంత లక్ష్మీ, రాజలక్ష్మి, బీబీ, మధులత, నాయకులు సమ్మారెడ్డి, కాశినాథ్ యాదవ్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
