నమస్తే శేరిలింగంపల్లి: ప్రతీ భారతీయుడు చూడాల్సిన చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్ అని, ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోందని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అన్నారు. ప్రతి ఒక్కరూ కాశ్మీర్‌లో జరిగిన అకృత్యాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. బిజెపి సీనియర్ నాయకులు రవి కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని మీరాజ్ గీత థియేటర్ లో ఒక పూర్తి స్క్రీన్ ద్వారా ప్రదర్శింపజేసి 200 మందితో కలిసి చిత్రాన్ని వీక్షించారు. ఆయన వెంట బిజెపి కాంటెస్టేడ్ కార్పొరేటర్స్ కసిరెడ్డి సింధు రెడ్డి, రాధా కృష్ణ, ఎల్లేష్, బిజెవైఎం నాయకులు నందనం విష్ణు దత్త్, బిజెపి నాయకులు, మోర్చా నాయకులు పాల్గొన్నారు.
