నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి బస్తీ, ప్రతి కాలనీని అభివృద్ధి చేసి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ ఏ బ్లాకులో స్థానికులతో కలసి కార్పొరేటర్ హమీద్ పటేల్ పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్పొరేటర్ హమీద్ పటేల్ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారంపై సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయా చోట్లలో ఉన్న బండ రాయిని తొలగించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు పూర్తి చేయిస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ ఉస్మాన్, మఖ్బుల్ చిచ్చా, సయ్యద్ అమీనుద్దీన్, జాఫర్, హర్షద్, పాషా భాయ్, అస్మాద్, జహీర్ మూల్ సాబ్, వాజీద్, మాగ్దూమ్, అబ్దుల్ కరీం తదితరులు ఉన్నారు.