నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని బికె ఎన్ క్లేవ్ కాలనీలో గల శ్రీ పద్మావతి ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం చతుర్దశ(14వ) వార్షిక బ్రహ్మోత్సవాలు అంబరాన్నంటాయి. వేంకటేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవంలో స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, సతీమణి శ్యామల దేవి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దైవ దర్శనంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు చంద్రిక ప్రసాద్ గౌడ్ , బీకే ఎన్ క్లేవ్ కాలనీ వాసులు ప్రతాప్ రెడ్డి, రమణారెడ్డి, గంగిరెడ్డి, సాయికృష్ణన్, శ్రీకాత్ రెడ్డి, నరేందర్ రెడ్డి, తిరుపతి నాయుడు, అమరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.