నమస్తే శేరిలింగంపల్లి: గత పాలకుల తప్పిదాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గచ్చిబౌలి డివిజన్ లోని నల్లగండ్ల హుడాకాలనీ లో, మంజీర డైమండ్ లో నెలకొన్న మురికి నీటి సమస్యపై వాటర్ వర్క్స్ అండ్ సివరేజ్ బోర్డు అధికారులతో కలిసి స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు చేసిన తప్పిదాల వల్ల ఆయా కాలనీల్లోని ప్రజలు ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తశుద్ధి లేని పాలకులు, అధికారులు ఇప్పటికైనా మురికి నీటి సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. అందుకు స్పందించిన అధికారులు మురికి నీరు వెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఎస్టీపి ప్లాంట్ ఏర్పాటుకు కావాల్సిన స్థలం గురించి ఇటు శేరిలింగంపల్లి, పటాన్ చెరు నియోజకవర్గాల ఎమ్మెల్యేల తోనూ, ఉన్నతాధికారులతోనూ చర్చించి పరిష్కారం చూపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండబ్ల్యుఎస్ జీఎం రాజశేఖర్, డీజీఎం నారాయణ, ఎస్టీపీ ప్లాంట్ మేనేజర్ పద్మజ, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, తెల్లాపూర్ కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డి, నారాయణ, నల్లగండ్ల హుడాకాలనీ, డిఫెన్స్ కాలనీ వాసులు సత్యనారాయణ యాదవ్, రఘుపతి రెడ్డి, పొంచి రెడ్డి, సతీష్, చంద్రశేఖర్, మృత్యుంజయ్, కృష్ణ, సుబ్బా రావు, రమేష్, కిరణ్, సాస్ట్రీ, దశరథ్, పావని, సులోచన, పద్మ, అరుణ, డాక్టర్ సీత, గోపాల్ రెడ్డి, పాపిరెడ్డి, మనోజ్,తదితరులు పాల్గొన్నారు.