నమస్తే శేరిలింగంపల్లి: ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన జరుగుతుందని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి తెలిపారు. చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట కాలనీ ఎంపీపీ ఉర్దూ మీడియం ప్రభుత్వ పాఠశాలను చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పేద మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి అన్నారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు, విద్యార్థుల హాజరు శాతాన్ని తెలుసుకున్నారు. పాఠశాలలో చేపట్టిన అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా పాఠశాలలో పనులను చేపట్టాలని విద్యార్థులకు మంచి వసతులు కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.