యూజీడీ పనుల‌ను పరిశీలించిన కార్పొరేటర్ రాగం‌ నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ప్రతి గల్లీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని బాపు నగర్ కాలనీలో నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజీ పనులను స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. యూజీడీ పనుల‌ను నాణ్యత ప్రమాణాలు పాటించి ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ప్రతీ గల్లీలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను, సీసీ రోడ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. శేరిలింగంపల్లి డివిజన్ ను అందరి సహకారంతో ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, బాపునగర్ బస్తి కమిటీ అధ్యక్షుడు రాజ్ కుమార్, సుధాకర్ రెడ్డి, శ్రావణ్ కుమార్, ముంతాజ్ బేగం, రియాజ్, యాదయ్య, శ్రీనివాస్ దాసోజు, పాటిల్, బ్రహ్మచారి, ఖాన్, విజయ్, అశోక్ గోపాల్ యాదవ్, రవి యాదవ్,డి. శ్రీకాంత్, నర్సింహ రెడ్డి, శ్రీను, శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.

యూజీడీ పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here