నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో 91 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేయడం పట్ల నిరుద్యోగులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు హర్షాతిరేకాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా గురువారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాష్ నారాయణ నగర్ లో స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ మంజుల రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా 91,142 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రకటన చేయడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గంగాధర్ రావు, బిఎస్ఎన్ కిరణ్ యాదవ్, మోహన్ ముదిరాజ్, చంద్రిక ప్రసాద్, రోజా, ప్రతాప్ రెడ్డి, మహేందర్ ముదిరాజ్, గోపారాజు శ్రీనివాస్, మాధవరం గోపాల్, మహమ్మద్ ఖాజా, సుప్రజా, లావణ్య, స్వరూప, రాణి, లత, రాజేష్ గౌడ్, దయానంద్, శ్రీధర్, కోటయ్య, వెంకటేష్, శ్రీనివాస్ రావు, ప్రసన్న, నరేష్, స్వామినాయక్, సుధాకర్, తిరుపతి నాయక్, రాజు, బాబ్జి, మల్లేష్, రాజుగౌడ్, హనుమంతరావు, రాఘవ రావు, కృష్ణ మూర్తి, చిన్న, మురళి, యు రాజు,కె నర్సింలు గౌడ్, రవిగౌడ్, అశోక్, వెంకట్ రెడ్డి, చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ధనలక్ష్మి, వరలక్ష్మి రెడ్డి, పులిపాటి నాగరాజు, ఓ.వేంకటేష్, అక్బర్ ఖాన్, మిరియాల ప్రితం, యేలమయ్య, దాసు, హరిష్ రెడ్డి, నరేంద్ర, గౌరవ్, రాజశేఖర్ రెడ్డి ఖాదర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.