నమస్తే శేరిలింగంపల్లి: భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే 125 వ వర్ధంతి వేడుకలు ఏఐఎఫ్ డీడబ్ల్యు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముజాప్పార్ అహ్మద్ నగర్ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి ఏఐఎఫ్ డీడబ్ల్యు గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి ఎ పుష్ప పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహారాష్ట్ర లో జన్మించిన సావిత్రిబాయి భర్త జ్యోతిరావు పూలే ను అతి చిన్న వయసులో పెళ్లి చేసుకొని భర్త కులమతాకతీతంగా చేయబడుతున్న సంస్కర, ఉద్యమంలో భాగమై పని చేసిందన్నారు. మహిళలు చదవకూడదని ఆనాటి ఆచారాలను వ్యతిరేకిస్తూ స్త్రీ లను విద్య పట్ల ముందు భాగంలో ఉండాలని జ్యోతిరావు పూలే నేర్పించిన విద్యను అభ్యసించి భారత తొలి ఉపాధ్యాయులుగా బాధ్యతలతో తన 19వ ఏట పూణేలో తొలి పాఠశాలను ఏర్పాటు చేశారని కొనియాడారు. పూలే దంపతులు కుల వ్యవస్థను వ్యతిరేకిస్తూ మరోపక్క మహిళలు అన్ని హక్కులు సాధించేదెలా చేసిన తామ పోరాడటం లో సామాజిక బాధ్యతగా ముందుకు సాగారని అన్నారు. భారతదేశంలో సంఘ సంస్కర్తగా,తొలి మహిళా ఉపాధ్యాయులుగా నేటి ఆధునిక సమాజానికి ఆమెకు ఆదర్శవంతమైన నాయకురాలని ఆమె ,ఆదర్శాలను నేటి మహిళలు పునికి పుచ్చుకుని నిరక్షరాస్యత, బాల్య వివాహాలు, స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు, హింస వ్యతిరేకిస్తూ పోరాటాలు చేయాలని మహిళల సమాజానికి పిలుపునిచ్చారు. ఏఐఎఫ్ డీవై యువతుల విభాగం గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ ఎండి సుల్తానా గ్రేటర్ హైదరాబాద్ నాయకురాళ్లు జీ.లావణ్య, శివాని, ఇందిరా, రజియా, శ్రీలత, పద్మ, గోపాలమ్మ తదితరులు పాల్గొన్నారు.