నమస్తే శేరిలింగంపల్లి: అసెంబ్లీ వేదికగా భారీ ఎత్తున 91,142 ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు నిరుద్యోగ యువత రుణపడి ఉంటుందని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. మునుపెన్నడూ ఏ ముఖ్యమంత్రి ప్రకటించని రీతిలో సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రకటన చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ నీళ్లు, నిధులు, నియమకాలు అనే ప్రధాన మంత్రంతో ఉద్యమాన్ని నడిపించి స్వరాష్ట్రం సాధించారన్నారు. కేసీఆర్ కార్యదక్షతకు నిదర్శనం ఉద్యోగ ప్రకటన అన్నారు.