నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం పట్ల ఎస్టీ సెల్ అధ్యక్షుడు స్వామి నాయక్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 91వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఎస్టీ సెల్ అధ్యక్షుడు స్వామి నాయక్ ఆధ్వర్యంలో పాలాభిషేకం వేశారు. మునుపెన్నడూ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపడుతున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ తండా అధ్యక్షుడు తిరుపతి నాయక్, శంకర్ నాయక్, సుధాకర్, అబ్రహం, కమలాకర్, ఎస్టీ సెల్ జనరల్ సెక్రటరీ లకపతి నాయక్, రమేష్, జితేందర్, రాకేష్,మాన్య, కృష్ణ, చరణ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.