నమస్తే శేరిలింగంపల్లి: ప్రస్తుతం ఉన్న బిజీ జీవితాల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బిజెవైఎం రాష్ట్ర కోశాధికారి, కొండాపూర్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ రఘునాథ్ యాదవ్ అన్నారు. ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా కొండాపూర్ సియా లైఫ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో లో 3కె రన్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా బిజెవైఎం రాష్ట్ర కోశాధికారి కొండాపూర్ డివిజన్ కంటస్టెడ్ కార్పొరేటర్ రఘునాథ్ యాదవ్, హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మనీంద్ర పాల్గొని 3కె రన్ ను ప్రారంభించారు. ప్రతి రోజూ నీరు అధిక శాతంలో తీసుకోవాలని, నీరు ఎక్కువగా తాగడం వలన కిడ్ని సంబంధిత వ్యాధులు దూరమయ్యే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రాహుల్ (నెఫ్రాలజీ), డాక్టర్ నాయణ్ రాజ్, డాక్టర్ వినయ్, సురేందర్, రమేష్ రెడ్డి, హాస్పిటల్ స్టాఫ్ రాఘవేంద్రకాలనీ వాసులు పాల్గొన్నారు.