నమస్తే శేరిలింగంపల్లి: పార్కులను అభివృద్ధి చేసుకుని అహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని శిల్ప పార్క్ లో నూతనంగా నిర్మించిన పార్క్ ను కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాస రావు, ఉదయ క్రిసెంట్ బిల్డర్స్ అధినేత రాజశేఖర్ తో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ సేవలో భాగంగా బిల్డర్ రాజశేఖర్ తన స్వంత ఖర్చులతో శిల్ప పార్క్ లో పార్కును ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఇక్కడి ప్రజలకు ఈ పార్కు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పార్కులో గ్రీనరీ ఏర్పాటు, పిల్లలకు ఆటస్థలం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, శిల్ప పార్క్ కాలనీ వాసులు రాజేశేఖర్, నరేంద్ర బాబు, చంద్రశేఖర్ రెడ్డి , ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.