నమస్తే శేరిలింగంపల్లి: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై చందానగర్ డీసీ సుధాంష్, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, ఇంజనీరింగ్ విభాగం, జలమండలి, టౌన్ ప్లానింగ్, ఎలక్ట్రికల్ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ పాదయాత్ర చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని అన్నారు. కాలనీలో రోడ్లు , డ్రైనేజీ తదితర సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా లేదని సంబంధిత సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించేలా చూడాలన్నారు. కార్యక్రమంలో అధికారులు ఈఈ శ్రీకాంతిని, డీఈ స్రవంతి, ఏఈ ప్రసాద్, ఏఎంఓహెచ్ కార్తిక్డ, టౌన్ ప్లానింగ్ ఏసీపీ సంపత్, జలమండలి మేనేజర్ సాయి చరిత, స్ట్రీట్ లైట్స్ ఏఈ రాంమోహన్, వర్క్ ఇన్‌స్పెక్టర్ విశ్వనాథ్, శానిటేషన్ సూపర్ వైజర్ శ్రీనివాస్, ఎస్ ఆర్ పీ కనకరాజు, నాయకులు ముప్పవరపు గంగాధర్ రావు, బి ఎస్ ఎన్ కిరణ్ యాదవ్, మోహన్ ముదిరాజ్, మహేందర్ ముదిరాజ్, ఖలిదిండి రోజా, చంద్రికప్రసాద్ గౌడ్, సుప్రజ, వరలక్ష్మి, ప్రతాప్ రెడ్డి, మహమ్మద్ ఖాజా, వజీర్, విజయ్, రాజు గౌడ్, వెంకటేష్, శివ, మురళి కృష్ణ, ప్రసాద్, సూర్యదేవర శ్రీనివాసరావు, శంకర్, లక్ష్మయ్య గౌడ్, అంజి ముదిరాజ్, రాజ, చిన్న, వెంకటేష్, శంకర్, కృష్ణ, స్వామి నాయక్, సుధాకర్, ప్రభాకర్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
