నమస్తే శేరిలింగంపల్లి: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వైజ్ఞానిక ప్రదర్శనల ద్వారా బయటకు వెలువడుతోందని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని రామయ్యనగర్ మాస్టర్ మైండ్స్ పాఠశాలలో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైజ్ఞానిక ప్రదర్శనలతో శాస్త్రీయ, దృక్పథం, సృజనాత్మకత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు బాలశాస్త్రవేతలుగా ఎదగాలన్నారు. నిత్య జీవితంలో ఉపయోగపడే ప్రాజెక్టులను తయారు చేసేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ మైండ్స్ స్కూల్ చైర్మన్ రాజు సంగాని, ప్రిన్సిపాల్ సుమలత, నాయకులు రవి యాదవ్, గోపాల్ యాదవ్, రవీందర్, పట్లోళ్ల నర్సింహారెడ్డి, దివాకర్ రెడ్డి, సురేష్, వినయ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
