నమస్తే శేరిలింగంపల్లి: కరెంటు మీటర్ బిగించేందుకు పదివేల రూపాయల లంచం డిమాండ్ చేసి నేరుగా అవినీతి నిరోదక శాఖ అధికారులకు ఎలక్ట్రికల్ లైన్ ఇన్‌స్పెక్టర్ పట్టుబడ్డారు. ఈ సంఘటన మాదాపూర్ ట్రాన్స్ కో ఆపరేషన్ కార్యాలయంలో శనివారం జరిగింది. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మాదాపుర్ సాయి నగర్ లో నాగజ్యోతి ఇంటికి కరెంట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోగా లైన్ ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్ రావు, లైన్ మెన్ సతీష్ రూ. 10 వేల లంచం డిమాండ్ చేశారు. అడిగినంత లంచం ఇస్తేనే ఇంటికి కరెంట్ మీటర్ బిగిస్తామని చెప్పడంతో చేసేదేమి లేక నాగజ్యోతి ఏసీబీ అధికారులకు పిర్యాదు చేశారు. ఏసీబీ డీఎస్పీ సుర్యనారయణ రెడ్డి ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు మాదాపూర్ ట్రాన్స్ కో ఆపరేషన్ కార్యాలయంలో దాడులు నిర్వహించారు. నాగజ్యోతి వద్ద నుంచి జూనియర్ లైన్ మైన్ సతీష్, లైన్ ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్ రావు డబ్బులు తీసుకునే సమయంలో నేరుగా పట్టుకున్నారు. నాగజ్యోతి పిర్యాదు మేరకు వారిని లంచం తీసుకుంటూ ఉన్న సమయంలో పట్టుకోవడం జరిగిందని, వారి నివాసంలోనూ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించనున్నట్లు తెలిపారు.
