నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ కళాశాలల అధ్యాపకుల అసోసియేషన్ (టెక్ఫా) ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర డైరీని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర నాయకులు కార్తిక్ రెడ్డి చేతుల మీదుగా వారి నివాసంలో ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రంలోని కళాశాలల అధ్యాపకుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ ఇంజనీరింగ్ కళాశాలల అధ్యాపకుల సమస్యలను సాధ్యమైనంత వరకు పరిష్కరించేలా చూస్తామని సానుకూలంగా స్పందించారు. అసోసియేషన్ నూతన అధ్యక్షుడు డా. కొరనీ రవీందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ పీవై రమేష్, వైస్ ప్రెసిడెంట్ డా.ఇలియాస్ అహమ్మద్, జనరల్ సెక్రెటరీ ప్రో. శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ డా. షేక్ సైదులు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ డా.వెంకటేశ్వర్లు, తదితరులు ఉన్నారు.
