పేదల కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు అభినందనీయం – ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: బస్తీ లలో నివసించే పేద ప్రజలకు ఉచిత మెగా వైద్య శిబిరంను నిర్వహించడం చాలా అభినందించదగ్గ విషయం అని ప్రభుత్వ విప్ గాంధీ, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తెలిపారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని కేశవ నగర్ లో టిమ్స్ హాస్పిటల్, జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఔట్ రీచ్ మెడికల్ క్యాంప్ (మెగా ఉచిత వైద్య శిబిరం) ను జోనల్ కమిషనర్ ప్రియాంక అల, డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి , టిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ విమల థామస్, డిప్యూటీ డిఎంహెచ్ఓ సృజన, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయిబాబా తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు.

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ టిమ్స్ హాస్పిటల్, జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత‌ వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. టిమ్స్ ఆస్పత్రి ఒకప్పుడు కరోనాకు వైద్య సేవలను అందించిందని, ఇక నుండి పూర్తి స్థాయిలో అన్ని హంగులతో, సకల సౌకర్యాల తో జనరల్ ఆసుపత్రిగా అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గాంధీ , ఉస్మానియా తరహాలో వైద్య సేవలు అందుబాటులో కి వస్తాయని, మరింత విస్తరించారని తెలిపారు. ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో టిమ్స్ సూపరింటెండెంట్ అహ్మద్ ఖాన్, ఏఎంఓహెచ్ డాక్టర్ రవికుమార్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు జంగయ్య యాదవ్, సురేందర్, రమేష్ గౌడ్, రాజు ముదిరాజు, నాగేష్ , నారాయణ ,అశోక్ ,అరుణ తదితరులు పాల్గొన్నారు.

ఉచిత వైద్య శిబిరంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here