నమస్తే శేరిలింగంపల్లి: ఆయువ్ స్టూడెంట్స్ యూత్ ఫౌండేషన్ (ఏఎస్ వైఎఫ్) చైర్మన్ శ్యామ్ 10వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఏఎస్ వైఎఫ్ వ్యవస్థాపకుడు జి. రోహిత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కీ.శే. శ్యామ్ సమాధి వద్దకు వెళ్లి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా శ్యామ్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. శ్యామ్ చేసిన సామాజిక సేవాతత్పరతను చూసి ఆయువ్ స్టూడెంట్స్ యూత్ ఫౌండేషన్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఇదే స్ఫూర్తి మున్ముందు కొనసాగుతుందని రోహిత్ ముదిరాజ్ అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ వైఎఫ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్, కలీం పాల్గొన్నారు.