సాయినాథుని ఆలయంలో ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: ఆలయాల సందర్శనతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని జనప్రియ నగర్ ఫేజ్ 1 లో గల సాయి బాబా దేవాలయ వార్షికోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ గాంధీ, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ వేర్వేరుగా ఆలయాన్ని సందర్శించారు. సాయినాథున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆధ్యాత్మిక వాతావరణం అందరిలో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ , మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, జనప్రియ రెసిడెంట్స్ సెంట్రల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్లా సంజీవ రెడ్డి, బాలింగ్ యాదగిరి గౌడ్, రాజు ముదిరాజ్, జనప్రియ ఫేస్-1 అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్, మల్లేష్, మీనాక్షి, హేమలత, జ్యోతి రెడ్డి, మాధవి, పావని, పద్మిని, భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు.
[

జనప్రియ ‌నగర్ ఫేజ్ 1 లోని‌ సాయిబాబా ఆలయ వార్షికోత్సవం లో పాల్గొన్న ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here