పాపిరెడ్డి కాలనీలో ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రదర్శన – స్టాల్స్ ను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: బ్రహ్మకుమారి సంస్థ వారు శేరిలింగంపల్లి డివిజన్ లో ద్వాదశ జ్యోతిర్లింగాలు, ఆధ్యాత్మిక చిత్ర స్టాల్స్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ లోని పాపిరెడ్డి కాలనీ పాత శివాలయం వద్ద బ్రహ్మకుమారి సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్స్ ని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బ్రహ్మకుమారి సంస్థవారు ప్రజలకు ఉచిత దర్శనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మ కుమారి సభ్యులు, పద్మ, శైలజ, జ్యోతి, బాలకృష్ణ,‌ గణేష్, అమర్,‌ సాగర్, రాజు,‌ బస్వరాజ్, పట్లోళ్ళ నర్సింహా రెడ్డి, గోపాల్ యాదవ్,‌ జమ్మయ్య, అలీ, భాగ్యలక్ష్మి, రజినీ తదితరులు పాల్గన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here