నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కలిసి కట్టుగా కంకణబద్దులమై పనిచేయాలని బిజెపి రాష్ట్ర నాయకులు మొవ్వా సత్యనారాయణ, రవికుమార్ యాదవ్, కసిరెడ్డి భాస్కర రెడ్డి పిలుపునిచ్చారు. బిజెపి బలోపేతానికి నిదర్శనంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తాండలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు సేవాలాల్ మహారాజ్ ఆలయంలో పూజలు చేసి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బిజెపి బలంగా మారిందని, రాబోయే రోజుల్లో కాషాయం జెండా ఎగరడం ఖాయమన్నారు. కలిసి కట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నడిగడ్డ తండా బిజెపికి అడ్డా అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు డిఎస్ఆర్కె ప్రసాద్, రాఘవేంద్రరావు, రాధాకృష్ణ యాదవ్, ఎల్లేష్, వినయ్, త్రినాథ్, మదనాచారి, జంగయ్య యాదవ్, హరికృష్ణ, లక్ష్మణ్ ముదిరాజ్, శ్రీశైలం కురుమ, గణేష్ ముదిరాజ్, హరిప్రియ, స్వప్న రెడ్డి, వినోద్ యాదవ్ , ఆంజనేయులు, చందు, మధు యాదవ్ , శివరాజ్, శ్రీను జె, రాము, రాజ్ జైశ్వాల్ తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.