నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముగ్గురు ఎస్ ఐ లకు స్థానచలనం కలిగిస్తూ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. చందానగర్ పోలీస్ స్టేషన్ లో పనిచేసే ఎస్ఐ అహ్మద్ పాషా జీడిమెట్లకు, బాల్ రాజ్ షాబాద్, రంజిత్ కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్లకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా చందానగర్ పోలీస్ సిబ్బంది బదిలీపై వెళ్తున్న ఎస్ఐలను సన్మానించారు.