పోలియో రహిత సమాజ స్థాపనకు సమిష్టిగా కృషి చేద్దాం – ఈ నెల 27 న పల్స్ పోలియో – పోస్టర్ ను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: చిన్నారుల నిండు జీవితానికి రెండు పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరి అని ప్రభుత్వ విప్,‌ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ నెల 27న ఆదివారం 0-5 సంవత్సరాల లోపు చిన్నారులకు పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టనున్న దృష్ట్యా పోలియో చుక్కల అవగాహన ఫోస్టర్ ను ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ విడుదల చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ నిండు జీవితానికి రెండు చుక్కలు, పోలియో చుక్కలు చిన్నారుల ఆరోగ్యకర భవిష్యత్తు కి ఇచ్చే భరోసా అని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి చిన్నారుల జీవితాలలో వెలుగును నింపాలని సూచించారు. పోలియో రహిత సమాజం‌ కోసం కృషి చేయాలన్నారు.  కార్యక్రమంలో ఎల్లమ్మబండ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ మానస, నర్సులు నదియా, జ్యోతి, సంతోషి, మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజ్, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, కూకట్‌పల్లి డివిజన్ అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ, నాయకులు ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.

పల్స్ పోలియో ఫోస్టర్ ను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్‌ గాంధీ

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here