నమస్తే శేరిలింగంపల్లి: ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఐదేళ్ల క్రితం ప్రారంభించిన ఫ్యామిలీ సెలూన్ శాఖలను విస్తరింపజేయడం అభినందనీయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజా రాజేశ్వరి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ ఆర్ హెచ్ ఫ్యామిలీ సెలూన్ 4వ బ్రాంచ్ ను స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి ప్రభుత్వ విప్, శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ ఆర్ హెచ్ ఫ్యామిలీ సెలూన్ ప్రజలకు ఉత్తమ సేవలందిస్తూ అందరి ఆదరాభిమానాలు పొందుతున్నారని అన్నారు. ఐదేళ్లుగా యస్ ఆర్ హెచ్ ఫ్యామిలీ సెలూన్ అత్యాధునిక పరిజ్ఞానంతో అన్ని రకాల సెలూన్ సేవలు అందించటం మంచి విషయమని పేర్కొన్నారు. ప్రజల అభిరుచి మేరకు మంచి సేవలను అందిస్తూ, ఎస్ ఆర్ హెచ్ సంస్థ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఒక్క శాఖతో ప్రారంభించి నాలుగో శాఖను ఏర్పాటు చేసిన సంస్థ చైర్మన్ మాదాసు రమేష్, ఎండి ఉపేందర్ కు ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ హమీద్ పటేల్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ రాజేష్ యాదవ్, రాజా రాజేశ్వరి కాలనీ ప్రెసిడెంట్ విజయ్ కృష్ణ, వైస్ ప్రెసిడెంట్ మధు ముదిరాజ్, యూత్ నాయకులు దీపక్ అజయ్ సింగ్, వెంకటేష్, శ్రీనివాస్, రామకృష్ణ, జానీ, వంశీ మోహన్, తదితరులు పాల్గొన్నారు.