నమస్తే శేరిలింగంపల్లి: సీసీ రోడ్డు నిర్మాణం పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో సురభి కాలనీలో రూ. 42 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు.
నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. శేరిలింగంల్లి డివిజన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్‌స్పెక్టర్ మహేష్, వార్డు మెంబర్ శ్రీకళ, కోదండరాం, వెంకట్ రెడ్డి, గోపాల్ యాదవ్, కుమారి, సుధారాణి, రోజా, కాలనీవాసులు పాల్గొన్నారు.