నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేసి ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల హుడా కాలనీ లో రూ. 4 కోట్ల అంచనా వ్యయం తో జరుగుతున్న యూజీడీ నిర్మాణ పనులను మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుడా కాలనీ లో ఇప్పటి వరకు 90 శాతం పనులు పూర్తయ్యాయని, మిగతా పనులను దశల వారీగా చేపట్టనున్నట్లు చెప్పారు. యూజీడీ పనులను త్వరగా చేపట్టాలని సూచించారు. ఎన్నో ఏళ్లుగా హుడా కాలనీలో నెలకొన్న యూజీడీ, సీసీ రోడ్డు సమస్య శాశ్వతంగా పరిష్కారం కానుందన్నారు. అనంతరం అదే కాలనీలో రూ. 50 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మంత్రి ప్రగడ సత్యనారాయణ, అనిల్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.