ఈ శ్రమ్ గుర్తింపు కార్డును సద్వినియోగం చేసుకోండి – బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: అసంఘటితరంగ కార్మికుల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాద భీమా పథకాన్ని ప్రవేశపెట్టారని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ తెలిపారు. శేరిలింగంపల్లి డివిజన్ పాపిరెడ్డి నగర్ కాలనీలో ఈ- శ్రమ్ పోర్టల్ కార్డు సెంటర్ ను రవికుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ రంగ కార్మికులతో పాటు కార్మికులందరూ ఈ శ్రమ్ గుర్తింపు‌ కార్డును పొందాలన్నారు. ఈ- శ్రమ్ పోర్టల్ కార్డు ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందవచ్చున్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లేష్, రమేష్, నరసింహ, శ్రీనివాస్, విజయ్ యాదవ్, సంజీవరెడ్డి, అఖిల్, గణేష్, అజయ్ కుమార్, విజయలక్ష్మి, సుశీల, పుష్పలత, మన్నెమ్మ తదితరులు ఉన్నారు.

ఈ శ్రమ్ సెంటర్ ను ప్రారంభిస్తున్న బిజెపి రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here