నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్రంలోని దళితుల్లో ద్విగుణీకృత మార్పు తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, పూజిత జగదీశ్వర్ గౌడ్, మంజుల రఘునాథ్ రెడ్డి, రోజాదేవి రంగారావు తో పాటు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు, దళితబంధుకు ఎంపికైన వంద మంది లబ్దిదారులతో సమావేశం ఏర్పాటు చేశారు. దళిత బంధు పథకం అమలు, కార్యాచరణ, ప్రణాళిక, మార్గదర్శకాలు, విధి విధానాల పై ఏర్పాటు చేసిన దళిత బంధు అవగాహన సదస్సులో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొని మాట్లాడారు. దళిత బంధు పథకం ద్వారా దళిత కుటుంబాలలో ఆర్థిక, సామాజిక అసమానతలు రూపు మాపి వారి జీవితాలలో కొత్త వెలుగులు నిండుతాయని అన్నారు.
దళిత కుటుంబాల సంక్షేమానికి కట్టుబడిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. ఎంపికైన 100 మంది లబ్ధిదారులు భవిష్యత్తులో మిగతా వారికి ఆదర్శంగా నిలిచేలా ఉండాలని, పక్కా ప్రణాళికతో యూనిట్లను నెలకొల్పి భావితరాలకు మార్గనిర్దేశకంగా ఉండాలని తెలిపారు. మార్చి 7 వ తేదీ లోగా పూర్తి స్థాయిలో పథకం అమలయ్యేలా చూడాలని సూచించారు. మార్చి తర్వాత మరో 2000 నుండి 3000 మంది లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని, దశల వారిగా దళిత బంధు పథకం పూర్తి స్థాయిలో అమలవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ఎస్సీ కార్పొరేషన్ ఈడీలు ప్రవీణ్, బాలాజీ, ఇండస్ట్రియల్ జీఎం రాజేశ్వర్ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ ప్రకాష్ రావు, అగ్రికల్చర్ ఏడీఈ లీల, ఏఓ ఉదయ్ కుమార్, ఎంవీఐ వాసు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జరీ రామారావు, మాజీ కౌన్సిలర్లు వీరేశం గౌడ్, మోహన్ గౌడ్, మాజీ కార్పొరేటర్ రంగారావు, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.