మన ఊరు మన బడి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి – సమీక్ష సమావేశం లో ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విపద, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమాన్ని శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో నిర్వహించేలా మండల వైద్యాధికారి వెంకటయ్య, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు , మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేలా చూడాలని సూచించారు. మొదటి విడతలో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి శేరిలింగంపల్లి మండలం పరిధిలో 24, కూకట్‌పల్లి మండలం పరిధిలో 7 మొత్తము 31 ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రతిపాదనలు పంపి‌నట్లు చెప్పారు. 3500 కోట్ల వ్యయంతో మొదటి విఢతలో 60శాతం మంది విద్యార్థులు చదివే పాఠశాలలను ఎంపిక చేసినట్లు చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులను మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని అన్నారు. రెండు ప్రత్యేక అకౌంట్ లు తెరిచి, పారదర్శకంగా నిధులు ఖర్చయ్యేలా చూడాలని, అన్ని పనులకు సామాజిక తనిఖీ నిర్వహించటం జరుగుతుందన్నారు. ప్రతి పనికి ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా ఆన్ లైన్ లో పొందుపరచారని తెలిపారు. ఎంపిక చేసిన పాఠశాలలో అన్ని ప్రక్రియలు వారం రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. ఎంఈఓ వెంకటయ్య, డబ్ల్యు ఐ డీ సీ ఏఈ వినయ్, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

సమీక్ష సమావేశం లో‌ మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here