సిద్దిక్ నగర్ లో ఈ శ్రమ్ సెంటర్ ను ప్రారంభించిన రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్ధిక్ నగర్ లో ఈ శ్రమ్ సెంటర్ ను బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసంఘటితరంగ కార్మికులకు అండగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ శ్రమ్ గుర్తింపు‌ కార్డులను ప్రవేశపెట్టారని అన్నారు. భవన నిర్మాణ కార్మికులు,‌ కర్షకులు, ఆయా రంగాల్లోని కార్మికులు 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయసున్న వారు ఈ-శ్రమ్ కార్డు పొందవచ్చన్నారు. ఈ-శ్రమ్ కార్డు పొందిన కూలీలు దేశంలో ఎక్కడైనా ఉపాధి పొందడం సులభమని తెలిపారు. ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు కోసం వచ్చిన కార్మికులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు సాగర్, ఎల్లేష్, రాధా కృష్ణ యాదవ్, భరత్, సంతోష్, చెన్నయ్య, రవి నాయక్, గణేష్ ముదిరాజ్, శ్రీనివాస్, రాము, పద్మ, మేరీ, రేఖ, రేణుక తదితరులు పాల్గొన్నారు.

సిద్దిఖ్ ‌నగర్ లో‌ ఈ శ్రమ్ కార్డులను అందజేస్తున్న రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here