నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ బస్ డిపో వద్ద గల శ్రీ కనకదుర్గమ్మ, కాళీ మాత ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం అమ్మవారికి పంచామృతాభిషేకం, అలంకరణ, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి శుక్రవారం ఆలయంలో అన్నదానం ఏర్పాటు చేయడంలో భాగంగా ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు రెండో వారం అన్నదానం చేశారు. నిరుపేద అమ్మాయికి వివాహం కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పుస్తె మట్టెలను అందించి వివాహం జరిపించారు. అందరి సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆలయ కమిటీ చైర్మన్ రాచమల్ల కృష్ణా పటేల్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ అడ్వైజరీ తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి, వైస్ చైర్మన్ పి. అనిల్ గౌడ్, జనరల్ సెక్రటరీ జి. శ్రావణ్ కుమార్, జాయింట్ సెక్రెటరీ హరి, బాలాజీ రావు, సురేష్ ,గోపి, ఆర్గనైజ్ సెక్రెటరీ కె. పాపిరెడ్డి, టి. నాథ్, శ్రీనివాస రెడ్డి, కోశాధికారి ఈ. రాజు, అడ్వైజరీలు కె.రాజ్ కుమార్, కె. వెంకటేష్, బి. శ్రీనివాస్, మెంబర్స్ శ్రీనివాస్ గౌడ్, జి. శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, సందీప్, ప్రకాష్, రేఖ, కిషోర్, పి. కిరణ్, శ్రీనివాస్ గౌడ్, రాజేష్ పంతులు, భక్తులు పాల్గొన్నారు.