నమస్తే శేరిలింగంపల్లి: అభివృద్ధి పనుల విషయంలో రాజీ పడేది లేదని, దశల వారీగా అన్ని సమస్యలను పరిష్కరించనున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తెలిపారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని దూబే కాలనీలో రూ.62 లక్షల రూపాయల అంచనావ్యయంతో నిర్మించనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, జలమండలి అధికారులతో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దూబే కాలనీలో రూ.62 లక్షలతో అంచనా వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టుకోవడం సంతోషకరమని అన్నారు. యూజీడీ నిర్మాణ పనులను వెంటనే చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జలమండలి జనరల్ మేనేజర్ రాజశేఖర్, డీజీఎం నారాయణ, మేనేజర్ యాదయ్య, టీఆర్ఎస్ శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు చింతకింది రవీందర్ గౌడ్, పద్మారావు, కృష్ణ యాదవ్, వేణు గోపాల్ రెడ్డి, నటరాజ్, రమేష్, రమణ, రవీందర్, గోపాల్ యాదవ్, పోచయ్య, అజమద్, శ్రీ కళ, అరుణ, భాగ్యలక్ష్మి, రజిని, కుమారి, సుధారాణి, జయ, దూబే కాలనీ వాసులు రితేష్ దూబే, మున్యా నాయక్, పిల్లి యాదగిరి, జగదీష్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.