నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లిలో ప్రజా సమస్యలపై స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి బస్తీబాట చేపట్టారు. కాలనీలో పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాల పనితీరుపై తనిఖీ చేశారు. జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటి పరిష్కార దిశగా కృషి చేయాలన్నారు. కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు శాయశక్తులా కృషి చేస్తానని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మన్నే రమేష్, రంగస్వామి, మురగ, చిన్న, మధు, విష్ణు, శ్రీకాంత్, సత్యనారాయణ, సాయి, సతీష్, భీమాజీ, రాజు, సుబ్బారావు, గోపన్ పల్లి కాలనీ వాసులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.