నమస్తే శేరిలింగంపల్లి: కాలనీలో ఏ చిన్న సమస్య నెలకొన్న సంబంధిత అధికారుల సహకారంతో ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తున్నామని నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు భేరి రాంచందర్ యాదవ్ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ లో నెలకొన్న యూజీడీ సమస్యను కాలనీ అధ్యక్షుడు భేరి రాంచందర్ యాదవ్ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేశారు. కాలనీలో నెలకొన్న ప్రతీ సమస్యను పరిష్కరించేందుకు ముందుంటానని రాంచందర్ యాదవ్ చెప్పారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన సివరేజ్ బోర్డు సూపర్ వైజర్ సురేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాలనీలోని ప్రతి సమస్యను వెంటనే పరిష్కరిస్తూ కాలనీ అభివృద్ధి కృషి చేస్తున్న అసోసియేషన్ సభ్యులకు కాలనీ ప్రజలు, పెద్దలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యక్షుడు రాయుడు, కృష్ణ ముదిరాజ్, వెంకటేష్ ముదిరాజ్, రాజేష్, కిషోర్, శివయ్య, తదితరులు ఉన్నారు.