నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీద్ బండలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ కమ్ సేల్ స్టాల్స్ ను స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. ప్రజలకు అవసరమయ్యే గృహోపకరణాలు, చేనేత వస్త్రాలు, జూట్ బ్యాగులు అందుబాటులో ఉండేలా ఈ స్టాల్స్ ను ప్రారంభించుకోవడం సంతోషకరమని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ శ్రీనివాస్, కిరణ్, సందీప్, సాయి, నర్సింహారెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.