నమస్తే శేరిలింగంపల్లి: పని కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం తాండూర్ కు చెందిన ఎరుకలి వెంకటప్ప(39), భార్య పద్మ జీవనోపాధి కోసం చందానగర్ గంగారంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సమీపంలో నివాసం ఉంటున్నారు. వెంకటప్ప ప్రతి రోజు చందానగర్ గాంధీ విగ్రహం వద్ద గల కూలీల అడ్డా వద్దకు వెళ్లి అక్కడి నుంచి పనికి వెళ్లి వస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ నెల 8 వ తేదీన ఉదయం 8.30 గంటలకు పని కోసం వెళ్తున్నా అని ఇంట్లో చెప్పి బయల్దేరిన వెంకటప్ప సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు అతని కోసం చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. వెంకటప్ప భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు చందానగర్ పిఎస్ కు గానీ, 100,04027853911, 9490617118, 7901110877 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగలరు.
