మత్తు పదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు – గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని గచ్చిబౌలి డివిజన్ కాకార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి బిజెపి కార్యాలయంలో ఎక్సైజ్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. పాఠశాల స్థాయి నుంచే మంచి అలవాట్లకు దగ్గరై చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. యువత క్రమశిక్షణ రాహిత్యంగా ఉంటూ డ్రగ్స్, గంజాయి వంటి వ్యసనాలకు బానిసలై అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ జీవితాన్ని అందకారంలోకి నెట్టివేసుకుంటున్నారని ఆవేదన చెందారు. ప్రతి నెలలో ఒకసారి ప్రతి పాఠశాలలో ఒక సమావేశం ఏర్పాటు చేసి పోలీసుల ద్వారా అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ గాంధీ నాయక్, ఎస్ఐ వీర బాబు, శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గోపనపల్లి వడెర సంఘం ప్రెసిడెంట్ అలకుంట శ్రీరామ్, సీనియర్ నాయకులు, నర్సింగ్ నాయక్, ప్రభాకర్, రంగస్వామి, మధు, నరేందర్, హనుమంతు, పోలీస్ ఆధికారులు తదితరులు పాల్గొన్నారు.

మాదక ద్రవ్యాల నిర్మూలనపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here