నమస్తే శేరిలింగంపల్లి: డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బిజెపి నాయకులు రవికుమార్ యాదవ్ అన్నారు. బిజెపి నాయకులు చేపట్టిన బస్తిబాట కార్యక్రమం లో భాగంగా ఐదో రోజు కొండాపూర్ డివిజన్ ప్రేమ్ నగర్ బి బ్లాక్ లో స్థానికులతో కలిసి బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ నాలా సమస్య చాలా తీవ్రంగా ఉందని, దాని ద్వారా వచ్చే దుర్వాసన, దోమలతో రోగాల బారిన పడుతున్నారని వాపోయారు. నివాసాల మధ్యన బీఫ్ మాంసం కట్ చేస్తున్నారన్నారు. 2019 మార్చి 6 వ తేదీన రూ. 89.70 లక్షలతో అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన చేసి నేటికి పనులు చేయకపోచడంపై రవికుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోచమ్మ ఆలయ నుంచి గుట్టకు వెళ్లేందుకు రోడ్లు లేవని, మంచినీటి సరఫరా, సరైన డ్రైనేజీ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పాలకులు, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఆంజనేయులు, రాధాకృష్ణ యాదవ్, చంద్రశేఖర్ యాదవ్, గోపాలకృష్ణ, రాజు, రాంరెడ్డి, శంకర్, రఘు, కృష్ణ, బాలాజీ, రమేష్ రెడ్డి, డివిజన్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.