నమస్తే శేరిలింగంపల్లి: ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని భవాని పురం , భవాని పురం వీకర్ సెక్షన్, వేమన వీకర్ సెక్షన్, వేమన రెడ్డి కాలనీలలో స్థానిక కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు, స్థానికులతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాదయాత్ర చేశారు. కాలనీలలో నెలకొన్న సమస్యలను ప్రజల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాలనీలలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామని, భవాని పురం లో డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. భవాని పురం వీకర్ సెక్షన్ కాలనీ లో ఎలక్ట్రికల్ స్తంభాల సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. అనంతరం వేమన వీకర్ సెక్షన్ లోని ప్రభుత్వ పాఠశాలను, బస్తీ దవాఖానను సందర్శించి డాక్టర్ లను వివరాలను తెలుసుకున్నారు. . రోడ్లు, డ్రైనేజి ,మంచి నీటి సమస్య లేకుండా చూస్తున్నామని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు.ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు.
ఎస్టీపీ ని పరిశీలించిన ఎమ్మెల్యే గాంధీ
చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన రెడ్డి కాలనీలో మురుగు నీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) ని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఎస్టీపీ నిర్వహణ సరిగ్గా నిర్వహిచాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. ప్లాంట్ చుట్టూ చెట్లను పెంచి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలన్నారు. చెరువులు కలుషితం కాకుండా మురుగు నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి చెరువులను సస్యశ్యామలం, సుందరీకరణ చేసి ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీకాంతిని, జలమండలి డీజీఎం నాగప్రియ, మేనేజర్ సునీత, ఏఎంఓహెచ్ కార్తిక్, టీపీఎస్ మధు, ఎలక్ట్రికల్ ఏఈ రాజ్ కుమార్, ఎస్ ఆర్ పీ బాలాజీ, వర్క్ ఇన్‌స్పెక్టర్ హరీష్, మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ గౌడ్, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు జనార్దన్ రెడ్డి, ఓ. వెంకటేష్, దాసరి గోపి, పుల్లిపాటి నాగరాజు, ఎల్లమ్మయ్య, రాజశేఖర్ రెడ్డి, మల్లేష్, అక్బర్ ఖాన్,కార్తిక్ గౌడ్, హరీష్, యశ్వంత్, దీక్షిత్ రెడ్డి, సందీప్ రెడ్డి, శ్రీధర్, అల్తాఫ్, అమిత్, ఇమ్రాన్, కుమార్, అసఫర్, వరలక్ష్మి, కాలనీ వాసులు శ్రీనివాస్ రెడ్డి, నాగిరెడ్డి, రఘునాథన్ రెడ్డి, సుందర్, వెంకటేష్ ,మహబూబ్,మల్లేష్, రమేష్, వెంకటేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
.