నమస్తే శేరిలింగంపల్లి: కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టారీతిగా మాట్లాడడం సరికాదని బిజెపి శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జీ గజ్జల యోగానంద్ దుయ్యబట్టారు. కేసీఆర్ చేసిన వాఖ్యలను ఖండిస్తూ బుధవారం చందానగర్ లోని అంబేద్కర్ విగ్రహానికి బిజెపి నాయకులు పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గజ్జల యోగానంద్ మాట్లాడుతూ దేశ ఆర్థిక శాఖ మంత్రి మహిళ అని చూడకుండా సీఎం కేసీఆర్ నోటికి వచ్చినట్టు అసభ్య పదజాలంతో తిట్టడం సరికాదన్నారు. ఏ రాజ్యాంగ వ్యవస్థతో అధికారాన్ని అనుభవిస్తున్నాడో అదే రాజ్యాంగాన్ని కించపరిచేలా మాట్లాడడం మంచి పద్దతి కాదన్నారు.
దేశ బడ్జెట్ ని, మహిళని, రాజ్యాంగాన్ని మతి స్థిమితం లేకుండా దుర్భాషలాడడం కేసీఆర్ నీచ బుద్ది కి పరాకాష్ఠ అని, రాజ్యాంగాన్ని నిందించడం అంటే ఆ రాజ్యాంగాన్ని రాసిన దళిత బిడ్డ అంబేద్కర్ ను అవమానపరచడమే అన్నారు. కేసీఆర్ కి దళితులు అంటే ముందు నుంచి చిన్న చూపే అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్, రాష్ట్ర దళిత మోర్చా అధికార ప్రతినిధి కాంచన కృష్ణ, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు రాచమల్ల నాగేశ్వర్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు రామ్ రెడ్డి, మానిక్ రావ్, రాజు శెట్టి కురుమ, జితేందర్,మేరీ, విజేందర్, బాబు రావు, చిట్టా రెడ్డి ప్రసాద్, ఆకుల మహేష్, రామకృష్ణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి , మధు, వినిత సింగ్, సుమా, శ్రీను, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.