నమస్తే శేరిలింగంపల్లి: మార్చాల్సింది భారత రాజ్యాంగాన్ని కాదు నిరంకుశ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అన్నారు. బస్తీబాటలో భాగంగా కొండాపూర్ డివిజన్ సిద్దిక్ నగర్ లో పలు సమస్యలపై రవి కుమార్ యాదవ్ స్థానికులతో, అక్కడి ప్రజలతో కలిసి రవికుమార్ యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టిఆర్ఎస్ నాయకుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయాయని అన్నారు. భూముల కబ్జాలు, చిన్న వ్యాపారులను సైతం వదలకుండా డబ్బులు వసూలు చేయడం, ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ బెల్టుషాపులు నడిపిస్తూ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వానికి సమస్యలపై చిత్తశుద్ధి లేదని, సిద్దిక్ నగర్ కాలనీ లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు మారిందన్నారు. బస్తీబాటలో డ్రైనేజీ, రోడ్లు, తదితర సమస్యలు మా దృష్టికి వచ్చాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఆంజనేయులు సాగర్, రాధా కృష్ణ యాదవ్, చంద్ర శేఖర్ యాదవ్, ఎల్లేష్, రేఖ, సంతోష్, సరోజ రెడ్డి, భరత్, రవినాయక్, గణేష్ ముదిరాజ్, శ్రీను, రాము సునీత, రజిత,మనెమ్మ, ప్రభ తదితరులు పాల్గొన్నారు.
